ప్రైవేటు బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు బోల్తా

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

● 20 మంది ప్రయాణికులకు గాయాలు

చంద్రగిరి : ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున చంద్రగిరి జాతీయ రహదారి భారత్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా ఒడిశాకు ఓ ప్రైవేటు బస్సు పయనమైంది. చంద్రగిరి జాతీయ రహదారి భారత్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో వస్తున్న క్రమంలో డ్రైవరు నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుపక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement