జైలు నుంచే కామిరెడ్డి జయకేతనం | - | Sakshi
Sakshi News home page

జైలు నుంచే కామిరెడ్డి జయకేతనం

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

● ఫలించిన భార్య, కుమార్తె పోరాటం ● ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ ● పటాపంచలైన కూటమి కుట్రలు

పెళ్లకూరు : జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి విజయ దుందుభి మోగించారు. ఆయన కూటమి అక్రమ కేసులతో జైలు జీవితం అనుభవిస్తున్నారు. జైలు నుంచే పెళ్లకూరు జెడ్పీటీసీకి నామినేషన్‌ వేశారు. మండలంలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలతో ఎనిమిది స్థానాలు ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు బరిలోకి దిగారు. ఆ రెండు స్థానాలతోపాటు పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. జెడ్పీటీసీకి మొత్తం 20,546 ఓట్లు పోలవగా వైఎస్సార్‌ సీపీకి 10,820, టీడీపీకి 9,112, నోటాకు 160, చెల్లని ఓట్లు 454 వచ్చాయి. మొత్తం మీద కామిరెడ్డి 1,708 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో 80 ఓట్లకుగాను వైఎస్సార్‌సీపీకి 42, టీడీపీకి 31, చెల్లనివి 7 ఓట్లు వచ్చాయి.

తల్లీకూతుళ్ల కృషి అమోఘం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెళ్లకూరు మండలంలో సత్యనారాయణరెడ్డిని టార్గెట్‌ చేసింది. అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు తరలించింది. ఆయన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నారు. అయినప్పటికీ జైలు నుంచే పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచారు. ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ, కుమార్తె కామిరెడ్డి రజిని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. కూటమి నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. అఖండ విజయాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement