సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు కూటమి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ పీఏ కుమారస్వామి అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని నాయని చెరువు గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు మండలం నాయని చెరువు గ్రామంలో గురువారం జరిగిన అరచకాలపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన సొంత నియోజకవర్గంలో రౌడీయిజం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపైకి వెళ్లి విచక్షణారహితంగా బెదిరింపులకు గురిచేశారని మండిపడ్డారు. ‘‘ఎన్నికల రోజు బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చుంటే ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలం.. ఊరిపైకి వందలాది మంది రౌడీ మూకలను దించి చంపేస్తాం’’ అంటూ తీవ్ర స్థాయిలో భయాందోళనలు సృష్టించారని వాపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అడ్డుకునేందుకు అధికార బలంతో విరవ్రీగుతున్న ఎమ్మెల్యే పీఏ కుమారస్వామిపై చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


