సైకిల్‌ టైర్‌ను పంచర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సైకిల్‌ టైర్‌ను పంచర్‌ చేయాలి

Nov 3 2026 2:03 AM | Updated on Nov 3 2026 2:03 AM

● ఫ్యాన్‌ను గిరగిరా తిప్పాలి ● వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి ఆర్కే రోజా విస్తృత ప్రచారం

నగరి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ‘‘సైకిల్‌ టైర్‌ను పంచర్‌ చేయాలి.. ఫ్యాన్‌ను గిరగిరా తిప్పాలి.. ఫ్యాన్‌ గాలి ప్రతి ఇంటికీ చేరాలి’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని వీకేఆర్‌ పురం ఎంపీటీసీ అభ్యర్థి భారతి రాము, జెడ్పీటీసీ అభ్యర్థి తులసమ్మకు మద్దతుగా, నిండ్ర మండలం ఆరూరు, ఇరుగువాయి ఎంపీటీసీ అభ్యర్థులు గౌరి, కళైప్రియ, జెడ్పీటీసీ అభ్యర్థి అనిల్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో బరిలో నిలిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మీరాసాహెబ్‌పాళెం, పాదిరి, జీఎన్‌ కండ్రిగ, ఆరూరు, ఇరుగువాయి పంచాయతీల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో చూపుతున్న నిర్లక్ష్యంపై ప్రశ్నలు సంధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన లబ్ధిని గుర్తుచేస్తూ మరోసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement