అధికారుల నిర్లక్ష్యం.. నిలదీసిన ఓటరు! | - | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యం.. నిలదీసిన ఓటరు!

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● ఏజెంట్‌ ఐడీ కార్డులో సంతకం తప్ప మరే వివరాలు లేని వైనం ● ప్రశ్నించిన ఓటరు రాంబాబు ● సమాధానం చెప్పలేక హడావుడిగా సరిదిద్దిన పీవో

చిత్తూరు కలెక్టరేట్‌ : నగరంలో 37వ డివిజన్‌ పరిధిలోని మిట్టూరు మెప్మా పోలింగ్‌ కేంద్రంలో అధికారుల అలసత్వాన్ని ఓ సాధారణ ఓటరు ఎండగట్టా డు. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన ఒక ఓటరు అక్కడున్న ఏజెంట్‌ గుర్తింపు కార్డును పరిశీలించారు. ఆ కార్డుపై పేరుగానీ, ఎలాంటి వివరాలు గానీ లేకపోవడాన్ని గమనించి తక్షణమే స్పందించారు. ‘ఎవరండీ ఈ వ్యక్తి? నిబంధనలకు విరుద్ధంగా, ఎన్నికలతో సంబంధం లేని వ్యక్తులను లోపలికి ఎలా అనుమతిస్తారు?’ అని పీవోను ప్రశ్నించారు. పీవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సదరు ఓటరు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల నిబంధనల ప్రకారం మీరు చేయాల్సిన ప్రాసెస్‌ను సక్రమంగా నిర్వహించి పోలింగ్‌ జరపండి.. అంతవరకు నేను ఇక్కడే నిలబడే ఉంటాను’ అంటూ గట్టిగా తేల్చి చెప్పారు. ఆ ఓటరు పట్టుబట్టడంతో దిగొచ్చిన పీవో, వెంటనే హడావుడిగా లోపాలను సరిదిద్ది ప్రక్రియను పూర్తి చేయించారు. ఆ సమయం వరకు సదరు ఓటరు పోలింగ్‌ కేంద్రంలోనే నిలబడి అధికారుల పనితీరును పర్యవేక్షించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని సంబంధిత ఓటరు అయ్యగారి రాంబాబు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసి రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారి, నగరపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement