ఓటుతో ‘హామీ’తుమీ తేల్చేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఓటుతో ‘హామీ’తుమీ తేల్చేద్దాం

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

● వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి

చిత్తూరు కార్పొరేషన్‌: హామీలు అమలు చేయని ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగభృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆడబిడ్డ నిధి పథకాలు అమలు కాలేదన్నారు. అలాగే యువత ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆరోపించారు. చిత్తూరులో పరిశ్రమలు, యూనివర్సిటీ తెస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమత్రి వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీవిద్యతో పాటు ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారని, వాటితో మరిన్ని పథకాలను జగనన్న సమర్థవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. జగనన్న సుపరిపాలనను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ చిత్తూరు మేయర్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, ఉద్యోగ, పెన్షన్సర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి వేర్వేరుగా మాట్లాడుతూ సామాజిక న్యాయానికి కట్టుబడి జగనన్న పాలన సాగించారని తెలిపారు. అందులో భాగంగానే డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌ను మేయర్‌గా గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement