అభివృద్ధికి చోటు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి చోటు

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

● మాజీ మంత్రి ఆర్కే రోజా ● పుత్తూరులో పలు వార్డుల్లో విస్తృత ప్రచారం

పుత్తూరు: ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేసినట్లేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. పుత్తూరు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక గేట్‌ పుత్తూరులోని 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో ఆమె విసృతంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జయప్రకాష్‌కు ఒక ఓటు, వార్డు కౌన్సిలర్‌కు మరో ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులకు ఓటు వేస్తే అభివృద్ధికి బాటలు వేసినట్లేనని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత జగనన్నదని తెలిపారు. ప్రస్తుత చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ సూపర్‌ మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జయప్రకాష్‌, 7 నుంచి 12 వరకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు జ్ఙానమ్మ, సుందరం, లత, వనిత, సావిత్రి, ఎం.టి.లత, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మహిళలను మోసం చేసిన చంద్రబాబు

5, 6 వార్డుల ప్రచారంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ గత ఎన్నికల్లో మహిళలకు పలు హామీలు గుప్పించిన చంద్రబాబు గెలిచిన తర్వాత అదే మహిళలను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఇలా ప్రజలకు మోసం చేశారు కాబట్టే మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల్లో అక్రమాలకు, దాడులకు బరితెగించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులకు తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చైర్మన్‌ అభ్యర్థి జయప్రకాష్‌, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులు కోటేశ్వరి, శివలింగం, నాయకులు వెంకటేశులురెడ్డి, భాస్కర్‌రెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement