ఐరాల: మండలంలోని చిన్నవెంకటంపల్లె సమీపంలోని శ్రీరాంనగర్‌లో ఇటీవల నూతనంగా నిర్మించి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామిని శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. పెద్దిరెడ్డికి ఆలయ ధర్మకర్త దేవేంద్రరెడ్డి, అర్చకులు రాజేష్దీక్షితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


