● జేసీ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు కలెక్టరేట్ : నగరపాలక సంస్థ చిత్తూరుతో పాటు కుప్పం, పలమనేరు, నగరి మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది నియామకానికి మూడో విడత రాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మా ట్లాడుతూ.. ఎన్నికల విధులలో నిష్పాక్షికత, పూర్తి పారదర్శకత పాటించేందుకే ఈ రాండమైజేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్‌ఐసీ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో రాండమైజేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా వివరించినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను డీఆర్‌వో మోహన్‌కుమార్ పర్యవేక్షించారన్నారు. ఎన్నిక లు సజావుగా, శాంతియుతంగా పూర్తిచేసేందు కు అవసరమైన సిబ్బంది నియామకాలను కంప్యూటర్ ఆధారిత విధానంలో పూర్తిచేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐసీ డీఐ వో వెంకటేశ్వరరావు, పలువురు ఎన్నికల అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక సెలవు
చిత్తూరు కలెక్టరేట్: నగరపాలక, పురపాలక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలో ఈనెల 31, నవంబర్ 1న పోలింగ్ కేంద్రాల పరిధిలో స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 31న పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం స్థానిక సెలవు ప్రకటించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
బైరెడ్డిపల్లె: చౌడేపల్లె మండలం చారాలలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి అండర్ –14 కబడ్డీ పోటీల్లో బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9 వతరగతి చదువుతున్న జి.మీన పాల్గొని ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. కృష్ణా జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మీన పాల్గొంటుందని పాఠశాల హెచ్‌ఎం మునిరాజ్ పేర్కొన్నారు.


