వి.కోట: తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు శుక్రవారం వైఎస్సారీసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వెంకటేగౌడ వారికి పార్టీ కండువాలు కప్పి వారికి ఆహ్వానం పలికారు. పార్టీలో చేరిన వారి లో పాముగానిపల్లి పంచాయతీ గుమ్మిరెడ్డి పల్లికి చెందిన టీడీపీ మాజీ వార్డు సభ్యుడు శ్యామ్ రెడ్డి, అతని అనుచరులు, కొంగాటం పంచాయతీ కారకుంట గ్రామానికి చెందిన ప్రశాంత్డ్డి అలియాస్ బుజ్జి, 10 కుటుంబాలకు చెందిన అతని అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో తోటకనుమలోని వెంకటేగౌడ నివాసంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరిన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ యువరాజ్, పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రకాష్, నాయకులు శివరామ్, రామకృష్ణ, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు, బాలాజీ, యుగంధర్ , కార్యకర్తలు పాల్గొన్నారు.


