వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత
ఐరాల: మండలంలోని చినకాంపల్లెకు చెందిన టీడీపీ నేత బాలకృష్ణారెడ్డి శుక్రవారం చిన్నవెంకటంపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వెస్సార్‌సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో బాలకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరుతుండడం హర్షణీయమన్నారు.
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ లక్ష్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పార దర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో శుక్రవారం భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 1,000 మంది పోలీసు సిబ్బంది, ఎస్‌టీఎఫ్ బలగాలు, వజ్రా వాహనంతో ఈ కవాతు చేపట్టారు. గాంధీ కూడలి నుంచి ప్రారంభమైన ఈ మార్చ్ చర్చి వీధి, జీజీహెచ్, దర్గా కూడలి, ఎంఎస్‌ఆర్ కూడలి మీదుగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర సాగింది. ఓటర్లు ఎలాంటి భయం, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషా, డీఎస్పీలు వెంకటనారాయణ, రామకృష్ణ, సీఐలు రామచంద్ర, శ్రీధర్‌నాయుడు, తిమ్మయ్య, కృష్ణమోహన్, ప్రసాద్‌రావు, నిత్యబాబు, ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


