కుప్పంరూరల్: కుప్పం మండల పరిధిలోని 21 ఎంపిటీసీలకు 21 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని ఎంపీపీ కై వసం చేసుకుంటామని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వానగుట్టపల్లి, గట్టప్పనాయునిపల్లి గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు మోహన్, జీవీ రమేష్‌లను గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. భతర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తే గెలవలేమని తెలిసి కుతంత్రాలు చేస్తోందని అన్నారు. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ధైర్యం చేసి బయటికి వచ్చి నామినేషన్లు వేస్తే పోలీసులతో భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమ విజయం వైఎస్సార్‌సీపీదే అని అన్నారు. మండల కన్వీనర్ హెచ్‌ఎం మురుగేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలే మా అభ్యర్థులను గెలిపిస్తుందని చెప్పారు. ఎన్.కొత్తపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. మల్లానూరులో మల్లానూరు సెగ్మెంట్ –1 వై ఎస్సార్ సీపీ అభ్యర్థి మునిలక్ష్మీకి మద్దతుగా జడ్పీటీసీ సభ్యురాలు వనితశీను ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం శీను, ముత్తు వీరమణి, సుబ్రమణ్యం, పొన్మణి, రాజా, శ్రీనివాసన్, భూపతి, రమేష్,కోమతి, కేశవన్, వెంకటేష్, మూర్తి ఉన్నారు.
ఎన్.కొత్తపలిలో ప్రచారం చేడుతున్న ఎంపీటీసీ సభ్యులు ఈశ్వర్
మల్లానూరులో జెడ్పీటీసీ అభ్యర్థి వనితశీను ప్రచారం


