చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాహుల్ పాండే ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఆయన పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూ రు డివిజన్‌లో విద్యుదాఘాతాల వల్ల ఏనుగులు మృతి చెందకుండా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయా లని ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, వ్యవసాయ పొలాల సమీపంలో వంగిపోయిన విద్యుత్ తీగలు (లోహ్యాంగింగ్ లైన్స్) ఏనుగుల మరణాలకు ప్రధా న కారణమని గుర్తించామన్నారు. 2027 మార్చి 31 నాటికి జిల్లాలో ఎక్కడ కూడా వంగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ల ఎత్తును పెంచడం, ఇన్సులేట్ చేయడం, అత్యంత ప్రమాదకరంగా ఉన్న 150 ప్రాంతాలకు ప్రాధాన్య త ఇచ్చి వాటిని సరిదిద్దడం జరుగుతుందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ, విద్యు త్ శాఖల సిబ్బంది వారానికి ఒకసారి క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు అక్రమ విద్యుత్ తీగల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు, అన్ని శాఖ లు సమన్వయంతో పనిచేస్తేనే ఏనుగుల ప్రాణాలను రక్షించగలమని వెల్లడించారు. ఈ సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా అటవీశాఖ అధికారు సుబ్బురాజు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


