గంగాధర నెల్లూరు: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువైపోతున్నాయని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న గ్రామ గ్రామాన్ని అభివృద్ధి పరిచారని.. అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. జీడీ నెల్లూరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శుక్రవారం నారాయణస్వామి పాల్గొన్నారు. వింజం పంచాయతీ సిద్దేశ్వర స్వామి కొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజేశ్వరి రామచంద్ర రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మండలం తూగుండ్రం పంచాయతీలో జెడ్పీటీసీ అభ్యర్థి శోభ ఆబు, ఎంపీపీ అభ్యర్థి రాజేంద్రరెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, దౌర్జన్యాలకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరపడిందని అన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని రౌడీ రాజకీయ సాంప్రదాయాన్ని తీసుకువచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజలు గమనించి మంచి వారికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, నాయకులు గుణశేఖర్ రెడ్డి, లోకనాథం రెడ్డి, మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, వింజం గోవిందన్, దేవ, వింజం బాలగంగానపల్లి పంచాయతీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


