చిత్తూరు కలెక్టరేట్ : రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసుల (బాణాసంచా) దుకాణాల ఏర్పాటులో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి అని చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. దుకాణాల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భద్రతా ప్రమాణాలు, మార్కెట్ ప్రాంతా లు, గతంలో మంజూరైన అనుమతులు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎవరి పేరు మీద లైసెన్స్ అవసరమో వారు నవంబర్ 1వ తేదీలోపు మీసేవ కేంద్రాల్లో చలానా చెల్లించి, జీఎస్టీ ప్రక్రియ పూర్తిచేసి ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి నవంబర్ 5వ తేదీ సాయంత్రంలోపు లైసెన్సుల పంపిణీని పూర్తి చేస్తామన్నారు. చిత్తూ రు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి దుకా ణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు కచ్చితమైన లొకేషన్ వివరాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటనారాయణ, అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రతా ప్రమాణాలు, నిబంధనలు తప్పనిసరి


