పెద్దపంజాణి: మండలంలో ని మదర్ థెరిసా పాఠశాల విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి పాఠశాల కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారని విద్యాసంస్థల చైర్మ న్ రవీంద్ర బాబు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడు తూ ఇటీవల చైన్నెలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ రికార్డు ఈవెంట్‌లో ఏకంగా 810 మంది ఒకేసారి కరాటే చాప్స్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు. ఇందులో మదర్ థెరిసా పాఠశాలకు చెందిన మోక్షిత్(7వ తరగతి), జుష్యవేద్, ప్రకృతి (4వ తరగతి) భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లో కూడా విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ డేవిడ్ బర్క్‌మన్ తెలియజేశారు. వీరికి శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్లకు, సహకరించిన తల్లి దండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది.
జిల్లా కబడ్డీ పోటీలకు ఎంపిక
గంగవరం: అన్నమయ్య జిల్లా చారాల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–14 బాలుర కబడ్డీ పోటీల్లో గంగవరం మండలంలోని కల్లుపల్లి జెడ్పీ హై స్కూల్ విద్యార్థి రిషి విజయం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల హెచ్‌ఎం బాలచైతన్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కలిసి కబడ్డీ పోటీలకు ఎంపికై న విద్యార్థిని అభినందించారు.


