అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

● జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌ ● పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలు వెల్లడి

చిత్తూరు కలెక్టరేట్‌ : రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. నవంబర్‌ 1వ తేదీన జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు రెండు రకాల బ్యాలెట్‌ పత్రాలను అందజేస్తారని చెప్పారు. పింక్‌ రంగు బ్యాలెట్‌ పత్రం మేయర్‌ అభ్యర్థి కోసం, తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రం కార్పొరేటర్‌ అభ్యర్థి ఓటింగ్‌ కోసం కేటాయించారన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈ రెండు బ్యాలెట్‌ పత్రాలను ఒకే బ్యాలెట్‌ బాక్సులో వేయాలని స్పష్టం చేశారు.

గుర్తింపు కార్డుల వివరాలు

ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, పోస్టాఫీసు పాస్‌బుక్‌, ఉపాధి హామీ వేతన జాబ్‌ కార్డ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌(ఆరోగ్య బీమా) కార్డు, పెన్షన్‌ డాక్యుమెంట్‌ (పింఛన్‌ పత్రం), సర్వీస్‌ ఐడీ కార్డ్‌, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డ్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక ఐడీ కార్డులు, వికలాంగుల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి కచ్చితంగా తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగానికి ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement