చిత్తూరు కార్పొరేషన్: కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలతో నూకలు చెల్లాయని ఽవైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, మేయర్ అభ్యర్థి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వారు గురువారం 5, 6, 17, 18, 19, 20, 37, 38 డివిజన్లలో ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగనన్నకు మద్దతు పలకాలని కోరారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. నామినేషన్ దశ నుంచి పోలీసులు, రౌడీమూకలతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి దాడులు చేశారని పేర్కొన్నారు. చివరికి నగరపాలక కార్యాలయంలో బీఫామ్స్ చింపివేసి దౌర్జన్యంతో ఏకగ్రీవం చేసుకున్నారని తెలిపారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఎన్నికలంటే ఉలుకెందుకని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాహుల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాబీ, శివ, మనోజ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శరవణ, శేఖర్, ఉన్ని, పూంగొడి, దస్తగిరి, రమేష్, షర్మి, టిమ్ము, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


