బైరెడ్డిపల్లె : ప్రజలను నమ్మించి, మోసగించిన కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఆయన బుధవారం బైరెడ్డిపల్లె మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కడతట్లపల్లె గ్రామస్తులు కార్తీక్, రవి, సులోచన, దొరస్వామి, మురగేష్ కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దయానందగౌడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, అందని పథకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు సువర్ణపాలన అందించారని గుర్తు చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. కూటమి నేతలు అవినీతి, దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులురెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేశవులు, జెడ్పీటీసీ అభ్యర్థి కార్తికేయన్, ఎంపీటీసీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


