పక్కాగా ఎన్నికల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఎన్నికల ప్రక్రియ

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించాలి ● కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

చిత్తూరు కార్పొరేషన్‌: ఎన్నికలను పక్కాగా నిర్వహించాలని, ఇందులో భాగంగా స్ట్రాంగ్‌ రూమ్‌లను సందర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆర్వోలను ఆదేశించారు. ఆయన బుధవారం జెడ్పీ సమావేశ మందింరలో ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌ సిబ్బంది కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ అంశాలపై ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులు నిర్ణీత సమయానికి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. విధులకు హాజరుకాని సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సందర్భాల్లో రిజర్వ్‌ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. ఈనెల 30, 31, నవంబర్‌ 1 తేదీల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్‌ బాక్సులను క్రమబద్ధంగా తరలించాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పుటేజ్‌ను భద్రపరచాలన్నారు. జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియలో ప్రత్యేక, సాధారణ కౌంటర్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులను పంపిణీ చేసే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి కేటాయించిన ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ సామర్థ్యంను బట్టి బ్యాలెట్‌ బాక్స్‌లు, పేపర్లు ఇవ్వాలన్నారు. డీఆర్వో మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 31లోపు పోలింగ్‌ సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు అనుపమ, భవాని, శ్రీనివాసులు నాయుడు, నగరపాలక కమిషనర్‌ నరసింహప్రసాద్‌, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement