ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలి ● జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌

పుత్తూరు: పుత్తూరు మున్సిపాలిటీతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా రక్షణ ఏర్పాట్లు చేయాలని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రంలోనూ పటిష్ట భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. ఆయన బుధవారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ వరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, పోలింగ్‌ సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద నిరంతరం నిఘా ఉండాలని, ఎన్నికల అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమలో ఆర్డీఓ రామ్మోహన్‌, డీఎస్పీ రవికుమార్‌, పుత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ నాగేశ్వరరావు, పుత్తూరు, నారాయణవనం తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, భార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement