నవంబర్‌ 5న పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 5న పోలింగ్‌

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

చిత్తూరు కార్పొరేషన్‌: నవంబరు 3న జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ తేదీని నవంబర్‌ 5కు, 5న జరగాల్సిన కౌంటింగ్‌ను 7వ తేదీకి మారుస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్‌ 1న మున్సిపల్‌ ఎన్నికలు, 3న ఫలితాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీస్‌, పోలింగ్‌ సిబ్బంది కొరత ఉండడంతో మార్పును చేసినట్టు పేర్కొంది. జిల్లాలో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రారంభమైంది. 27 మండలాలకు ప్రత్యేక కోడ్‌ నంబర్లను కేటాయిస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. మండలాలకు 1 నుంచి 27 వరకు కోడ్‌ నంబర్లను కేటాయించగా, జెడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్లపై చిత్తూరు జిల్లా కోడ్‌గా 22ను నిర్దేశించారు. మండలాల వారీగా కేటాయించిన కోడ్‌ నంబర్లను బ్యాలెట్‌ పేపర్ల కౌంటర్‌ ఫైల్‌, ప్రధాన పత్రంపై నిర్దేశిత రబ్బరు స్టాంపుతో ముద్రించనున్నారు. ఒక మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఒకే కోడ్‌ నంబరును వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లను గులాబీ రంగులో, జెడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్లను తెలుపు రంగులో ముద్రిస్తున్నారు. ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లకు 0001 నుంచి, జెడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్లకు 00001 నుంచి వరుస సంఖ్యలు కేటాయించనున్నారు. ఒక్కొక్క కట్టలో 50 బ్యాలెట్‌ పేపర్లు ఉండేలా, వరుస సంఖ్యలు కొనసాగిస్తూ సిద్ధం చేయనున్నారు. అనంతరం వెయ్యి బ్యాలెట్‌ పేపర్ల చొప్పున ప్యాకింగ్‌ చేయాలని ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాతో ముసాయిదా బ్యాలెట్‌ పేపర్లను ముందుగా రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు పరిశీలించి ఆమోదించాలని, ముుద్రణ సమయంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ వద్ద ఉండి, బ్యాలెట్‌ పేపర్లు సక్రమంగా ముద్రితమై సంబంధిత మండలాలకు చేరేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement