వి.కోట: ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. ఆయన బుధవారం ఎస్ బండపల్లి ఎంపీటీసీ అభ్యర్థి సుధ రఘుపతి నాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి ప్రకాష్, వి.కోట 1వ ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్తి శీశికళతో కలిసి ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, గ్రామాల అభివృద్ధి జరగాలన్నా వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిఎన్ నాగరాజు, మాజీ సర్పంచ్ పిఎన్ లక్ష్మి, నాయకులు ఎస్‌ఎ గౌస్, శ్రీనివాసులు, ముంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.


