ప్రత్యర్థులుగా బాబాయ్‌.. అబ్బాయ్‌! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులుగా బాబాయ్‌.. అబ్బాయ్‌!

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● ప్రముఖ శల్యవైద్యుల మధ్య రసవత్తర పోరు ● 35వ వార్డు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ కృష్ణమరాజు ● టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ప్రతాప్‌రాజు

పుత్తూరు: దేశ వ్యాప్తంగా పుత్తూరు శల్యవైద్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుత పుత్తూరు మున్సిపాలిటీ 35వ వార్డు కౌన్సిలర్‌ స్థానానికి బాబాయ్‌, అబ్బాయ్‌ ప్రధాన రాజకీయ పార్టీల ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. పుత్తూరు రాచపాళెంకు చెందిన ప్రముఖ శల్యవైద్యులుగా పేరు గాంచిన డాక్టర్‌ ఎస్‌.కృష్ణమరాజు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎస్‌.ప్రతాప్‌రాజు ఎన్నికల బరిలో దిగారు. వీరు స్వయాన బాబాయ్‌, అబ్బాయ్‌లు. కృష్ణమరాజుకు అన్న కుమారుడు ప్రతాప్‌రాజు. తొలి నుంచి రెండు కుటుంబాలు రాజకీయ నేపథ్యం కలిగి ఉండడంతో ఈ వార్డు ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కృష్ణమరాజు రాచపాళెం సింగిల్‌విండో అధ్యక్షుడుగా ఏకగ్రీవం కాగా, ఆయన భార్య సుజిని రాచపాళెం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. అలాగే కృష్ణమరాజు పెదనాన్న మార్కెండేయరాజు కుమారుడైన సుబ్రమణ్యంరాజు కుమారుడు ప్రతాప్‌రాజు. ఈయన 2014 ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా రెండున్నరేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. ఈయన తండ్రి సుబ్రమణ్యంరాజు సైతం మూడు దఫాలు సర్పంచ్‌గా ఎన్నిక కాగా అందులో రెండుసార్లు ఏకగ్రీవమైన చరిత్ర ఈ కుటుంబానిది. ఇంతటి బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన ఒకే కుటుంబం నుంచి తొలిసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీల తరఫున ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. దీంతో వార్డు ఎన్నిక ఫలితంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement