కుప్పం: గుడుపల్లె మండలం వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లావణ్య దేవప్పనాయుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం ఓఎన్కొత్తూరు గ్రామ పంచాయతీలోని ఆది కీరమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని పారంభించారు. గుడుపల్లె మండలంలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓఎన్కొత్తూరు ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్.వి లావణ్య, జెడ్పీటీసీ అభ్యర్థిగా లావణ్య దేవప్ప నాయుడు పోటీ చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి రెండు ఓట్లు ప్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ సీపీ గెలిపించాలని వారు కోరారు.


