– 8లో
పూల రైతుల ఆందోళన
తాము పండించిన పూలను బయటి ప్రాంతాల వారికి నేరుగా విక్రయిస్తే వ్యాపారులు అడ్డుకుంటున్నారని రైతులు నిరసన తెలిపారు.
సాక్షి, చిత్తూరు: ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వడానికి బ్యాలెట్ పత్రాల ముద్రణ మొదలయ్యింది. జిల్లాలోని చిత్తూరు మేయర్‌తో పాటు, పలమనేరు, కుప్పం మునిసిపల్ చైర్సన్లు.. 94 వార్డులకు వచ్చే నెల 1న ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు, కుప్పం మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే అధికారులు బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తిచేశారు. ఇందులో రెండు రకాల రంగులను ఎంచుకున్నారు. చిత్తూరు మేయర్‌తో పాటు నగరి, పలమనేరు, కుప్పం చైర్‌పర్సన్ స్థానాలకు గులాబి రంగు బ్యాలెట్, వార్డు కౌన్సిలర్–కార్పొరేటర్ స్థానానికి తెలుపు రంగు బ్యాలెట్‌ను ముద్రించారు. ముద్రణ పూర్తయిన బ్యాలెట్ పత్రాలు మొత్తం ఆయా మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకుని, స్ట్రాంగ్ గదికి తరలించారు. చిత్తూరు మేయర్‌తో పాటు 9 డివిజన్లు, పలమనేరులో చైర్‌పర్సన్, 30 వార్డులు, కుప్పంలో చైర్‌పర్సన్, 19 వార్డులు, నగరిలో 36 వార్డుల్లో పోలింగ్ నిర్వహించడానికి బ్యాలెట్ పత్రాల ముద్రణ, పంపిణీ పూర్తయ్యింది.
అక్రమాలపై చర్యలు తీసుకోండి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 39 మంది ఎంపీటీసీ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆ పార్టీ జిల్లా కార్యాలయ మేనేజర్ హరికృష్ణ తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ, మాజీ మంత్రి రోజా తరఫున ఫిర్యాదును తెలియజేశారు. ఈమేరకు పులిచెర్ల మండలంలో 23, రామకుప్పం మండలంలో 16 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేయకుండ టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారన్నారు. పులిచెర్ల మండంలో దాడులు జరిగిన పోలీసులు స్పందించలేదన్నారు. దీంతో అభ్యర్థులు నామినేషన్ వేయలేకపోయారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అదనపు పోలీసు రక్షణ కావాలని వివరించారు.


