నేడు ఎంఆర్‌ఆర్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు ఎంఆర్‌ఆర్‌ సమావేశం

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● 30న రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 ప్రయోగం

సూళ్లూరుపేట:ఇస్రో సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న అర్ధరాత్రి 11.51 గంటలకు ప్రయోగించనున్న జియో సింక్రనస్‌ లాంఛింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18) రాకెట్‌కు సంబంధించి బుధవారం ఎంఆర్‌ఆర్‌ సమవేశాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగవేదిక మీదున్న రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి సిద్ధం చేశారు. మిషన్‌ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ప్రయోగ పనులను ల్యాబ్‌కు అప్పగించనున్నా రు. ఆధరైజేష్‌ బోర్డు వారు లాంచ్‌ రిహార్స్‌ల్‌ నిర్వహించి కౌంట్‌డౌన్‌ సమయాన్ని బుధవారం రాత్రికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రయోగానికి 27.30 గంటల ముందు అంటే 29న రాత్రి 8.21 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం తుపాన్‌ ప్రభావం వల్ల ఏవైనా చిన్న మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ మూడు దశల రాకెట్‌ ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తి చేసే విధంగా డిజైన్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement