విజ్ఞతతో ఓటెయ్యండి | - | Sakshi
Sakshi News home page

విజ్ఞతతో ఓటెయ్యండి

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● వైస్సార్‌సీపీ హయాంలో జరిగిన మేలు ఆలోచించండి ● ఎమ్మెల్సీ భరత్‌

కుప్పంరూరల్‌: రాబోయే ఎన్నికల్లో జనం విజ్ఞతతో ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని 1వ వార్డు బండశెట్టిపల్లి, 2వ వార్డు చీగలపల్లి, 3వ వార్డు సామగుట్టపల్లి, 4వవార్డు బాబునగర్‌, 10వ వార్డు బేవనపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భరత్‌ మాట్లాడుతూ, ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మీకు జరిగిన మేలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేవలం కూటమి నాయకులు మాత్రమే బాగుపడుతున్నారని, ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని, ఓటు హక్కుతో ప్రభుత్వాలను మార్పు చేసుకుని, మంచి ప్రభుత్వాలు, పాలకులను ఎంచుకునే సౌలభ్యం ఓటు హక్కు అందరికి కలిగించిందన్నారు. అలాంటి ఓటును సేవే పరమావధిగా పనిచేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. ఓటమి భయంతో నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్న వైనాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. తమ అభ్యర్థులు అధికారంలోకి వస్తే సేవ చేస్తారని, కూటమి నాయకులు వస్తే నెత్తిన ఎక్కి జనాన్ని కీలుబొమ్మలుగా వాడుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు హఫీజ్‌, మునిరాజు, మణి, వెంకటాచలం, పొన్నుసెల్వం, సంపత్‌, హనుమంతు, ప్రబాకర్‌, నాగరాజులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement