రగ్బీ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రగ్బీ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

తిరుపతి సిటీ: కర్నూల్‌ ఆదర్శ జూనియర్‌ కళాశాల వేదికగా ఈనెల 10 నుంచి రెండు రోజుల పాటు జరిగిన 70వ ఎస్‌జీఎఫ్‌ రగ్బీ అండర్‌–19 అంతర్‌ జిల్లా టోర్నమెంట్‌లో శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఓవరాల్‌ చాంపియన్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భువనేశ్వరి ప్రతిభ చూపిన విద్యార్థినులు చైతన్యలక్ష్మి, హారిక, చంద్రకళను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సదర్భంగా ఫిజికల్‌ డైరెక్టర్‌ సాయి సుమతిని ప్రిన్సిపల్‌ అభినందించారు.

పాల ఉత్పత్తులపై శిక్షణ

చంద్రగిరి: నిరుద్యోగ యువతీయువకులతో పాటు ఔత్సాహికులైన రైతులకు ఎస్వీ పశు విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ కంటిన్యూఇంగ్‌ వెటర్నరీ ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు పాల ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ వైకుంఠరావు పాల్గొని ప్రసంగించారు. మంగళవారం నుంచి 31వ తేదీ వరకు ‘శాసీ్త్రయ పద్ధతులలో పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తులతో ఉపాధి అవకాశం’ అనే అంశంపైన నిరుద్యోగ, ఔత్సహిక రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణలో ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి 72 మంది ఔత్సహికులు పాల్గొన్నారన్నారు. డైరెక్టర్‌ శోభమణి, ప్రొఫెసర్‌ సుజాత, రెడ్డివరప్రసాద్‌, గంగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement