పకడ్బందీగా మున్సిపల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మున్సిపల్‌ ఎన్నికలు

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

పలమనేరు: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు పగడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ ళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం వారు పరిశీలించారు. ఇక్కడి రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటిగ్‌ సెంటర్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల లెక్కింపు పారదర్శకంగా ఉండాలని స్థానిక ఆర్డీవో భవానికి సూచించారు. కౌంటింగ్‌ సందర్భంగా రాజకీయపార్టీ ఏజెంట్లు, అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్‌ జరిగేచోట మూడంచెల భద్రత ఉంటుందన్నారు. మరోవైపు నియోజకవర్గంలోని మండలాల వారిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement