పలమనేరు: మున్సిపల్ ఎన్నికల వేళ పలమనేరు పట్టణంలోని రంగాపురానికి చెందిన 25 కుటుంబాలు టీడీపీ, జనసేన పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తామంతా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చెంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు నయాక్, ఫయాజ్, నాయకులు ఫైరోజ్, సుబ్రమణ్యం నాయుడు, మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి పెద్దపంజాణి టీడీపీ నేతలు
పెద్దపంజాణి: మండలంలోని శివాడి గ్రామ పంచాయతీకి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు శంకర్, రఘునాథ రెడ్డి, బాలరాజు, మాసలామణి తదితరులు తమ అనుచరులతో సోమవారం పలమనేరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేగౌడ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


