కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్సార్‌సీపీదే | - | Sakshi
Sakshi News home page

కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్సార్‌సీపీదే

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

● ఎమ్మెల్సీ భరత్‌

కుప్పంరూరల్‌: రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ కూడా వైఎస్సార్‌ సీపీ దక్కించుకుంటుందని ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. సోమవారం వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను గెలిపించాలంటూ డీకే పల్లిలో ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు అందజేసి తప్పక ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. భరత్‌ మాట్లాడుతూ, కూటమి నాయకులు ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సక్రమంగా నామినేషన్లు కూడా వేయనివ్వలేదన్నారు. బినామీ పేర్లతో తమ అభ్యర్థులను పోటీనుంచి లేకుండా విత్‌డ్రాలు చేసుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పక మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రెండేళ్లు పూర్తయినా కూటమి నేతలు చేసింది ఏమీ లేదన్నారు. కనీసం ఎల్‌నినో సమయంలో రైతులను ఆదుకోలేక పోయిందని విమర్శించారు. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, కక్ష సాధింపులు, పోలీసులు కేసులు తప్ప జనానికి ఒరిగిన మేలు ఏమీ లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను కిడ్నాప్‌లు చేయడం, దొంగ విత్‌డ్రాల పేరిట అభ్యర్థులను తొలగించడం దారుణమన్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని తప్పక బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రచారానికి ముందు ఎన్ని ప్రబోలాభాలు పెట్టినా వెరవక నిలబడిన చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హఫీజ్‌, మునిరాజు, మణి, వెంకటేష్‌, మోహన్‌రామ్‌, మల్లప్ప, కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement