ఎన్నికల విధుల్లో నిబంధనలు ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో నిబంధనలు ముఖ్యం

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

● పోలింగ్‌ రికార్డులు పక్కాగా నమోదు చేయాలి ● అధికారుల శిక్షణలో డీఆర్‌వో మోహన్‌ కుమార్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిబంధనలు ముఖ్యమని డీఆర్‌వో మోహన్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియలో పోలింగ్‌ అధికారి డైరీ, బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌, పేపర్‌ సీల్‌ అకౌంట్లు అత్యంత కీలకమైన అధికారిక పత్రాలన్నారు. వాటిని ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తాను కేరళలో ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసినప్పుడు అక్కడ అధికారులు రికార్డులను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించిన తీరును గుర్తుచేశారు. ప్రస్తుతం మన జిల్లాలోనూ అదే పద్ధతిలో రికార్డుల నమోదు పారదర్శకంగా జరగాలన్నారు. ముఖ్యంగా పోలింగ్‌ అధికారి యారో క్రాస్‌ మార్క్‌ రబ్బరు స్టాంపును నిబంధనల ప్రకారమే వాడేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో వేరే గుర్తులు వాడడం వల్ల పొరపాట్లు జరిగాయని చెప్పారు. ఈసారి ఎన్నికల సామగ్రి వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెండర్‌ ఓట్లు, ఇతర సాంకేతిక సమస్యలపై ముందస్తు అవగాహనతో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎటువంటి సందేహాలు, సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ శిక్షణలో డీఎల్‌డీవో రవి, మాస్టర్‌ ట్రైనర్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement