తిరుమల: తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా సాగింది. భారత ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్ వాహన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కాగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో జీయర్ స్వాములు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.


