టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

బైరెడ్డిపల్లె : మండలంలోని కొత్తయిండ్లు, కమ్మనపల్లె, చప్పిడిపల్లె తదితర గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించిన విషయాలన్ని గ్రామాల్లో గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు.

మల్లానూరు వైన్‌షాపులో చోరీ

కుప్పం రూరల్‌ : మండలంలోని మల్లానూరు వైన్‌షాపులో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. దుకాణం షట్టర్లు తెరిచి ఇనుప కమ్మీలను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో దొంగల ఆచూకీ తెలియరాలేదు. సుమారు రూ.లక్ష మద్యం బాటిళ్లను చోరీ చేసినట్టు యజమానులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

నగరి: తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఆదివారం ఆటో ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. నగరి సీఐ మల్లికార్జునరావు కథ నం మేరకు.. పుత్తూరు పట్టణం ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన దూదేకుల సద్దాం (28) ఆదివారం నగరి మండలం మీరాసాహెబ్‌ పాళెంలోని తన అత్తగారింటికి వెళ్లా డు. అక్కడ భార్య, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి పుత్తూరుకు తిరిగివచ్చాడు. మధ్యాహ్నం వారి ని తిరిగి తీసుకువచ్చేందుకు నగరికి వస్తుండగా తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని జాతీ య రహదారిపై ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యూజీలో అడ్మిషన్‌

దరఖాస్తుకు నేడే ఆఖరు

తిరుపతి సిటీ : ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో యూజీ ప్రవేశాలకు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం తుదివిడత ప్రవేశాల కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగి యనుంది. ఫైనల్‌ ఫేజ్‌ అడ్మిషన్ల కోసం ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 26, 27వ తేదీలలో వెబ్‌ ఆప్షన్లు, 28న అప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని, 30వ తేదీన సీట్లు కేటాయిస్తారని వెల్లడిస్తున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో నవంబర్‌ 2వ తేదీలోపు రిపోర్టు చేసి ప్రవేశాలు పొందాలని వివరిస్తున్నారు.

నేడు అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్లు స్వీకరణ

రేణిగుంట : మండలానికి సంబంధించిన అగ్రిగోల్డ్‌ బాధితులు ఎవరైనా ఉంటే సోమ, మంగళవారాల్లో వారి వద్ద ఉన్న బాండ్లను తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డెస్క్‌లో అందించాలని సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్‌ ఆదివారం తెలిపారు. ఒరిజినల్‌ అగ్రిగోల్డ్‌ బాండ్‌, ఇతర పత్రాలను తీసుకుని రావాలని సూచించారు. మిగిలిన మండలాల వారు రావాల్సిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.

నేడు శ్రీసిటీలో సీఐఐ సదస్సు

తిరుపతి అర్బన్‌ : శ్రీసిటీ క్రియా యూనివర్సిటీలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూ రు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్తలు సదస్సుకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 65 పారిశ్రామిక ఒప్పందాలకు పైగా జరగనున్నట్లు వివరించారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌, ఆహార శుద్ధి పరిశ్రమలు, అంతరిక్ష రంగం, పర్యాటకం, ఆతిథ్యం, ఆటోమొబైల్‌ విడి భాగాలు, ఫార్మా, సోలార్‌ ఉత్పత్తులు, లాజిస్టిక్స్‌, ప్యాకేజింగ్‌, రీసైక్లింగ్‌, పాదరక్షల తయారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పలు రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించనున్నారని తెలిపారు.

క్రీడాపోటీల విజేతలు వీరే

పలమనేరు: పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్వీయూ అంతర కళాశాలల పురుషుల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందు లో భాగంగా వాలీబాల్‌ విభాగంలో విజేతగా ఏటీఎన్స్‌ తిరుపతి, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో అమోష్‌ జ్ఞానాంబిక కళాశాల, రన్నర్‌గా ఎస్వీయూ జయంత్‌, బాడ్మింటన్‌ డబుల్స్‌లో ఎస్వీయూకు చెందిన చేతన్‌, సిద్ధేశ్వర్‌, రన్నర్స్‌గా వాగేష్‌, జయంత్‌కుమార్‌, చెస్‌లో ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన ఆనంద్‌, రన్నర్‌గా ఎస్వీయూ మహేష్‌, టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో అభిషేకక్‌, మనోజ్‌కుమార్‌, డబుల్స్‌లో ఎస్వీయూ వెంకటేశు, గోవిందరెడ్డి, శ్రీజ్ఞానాంబిక కళాశాలకు చెందిన మనోజ్‌కుమార్‌, లిఖిత్‌ విజయం సాధించారు. విజేతలకు సీఐ మోహన్‌రెడ్డి బహుమతులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement