వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.95.12 లక్షలు | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.95.12 లక్షలు

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

● జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి హుండీల ద్వారా రూ.95.12 లక్షల ఆదాయం వచ్చింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. గత 16 రోజులకు గాను స్వామివారికి కానుకల రూపంలో రూ.95,12,839 ఆదాయం వచ్చినట్లు ఈవో పెంచల కిషోర్‌, డీఈఓ సాగర్‌బాబు తెలిపారు. నగదుతో పాటు స్వామివారికి భక్తులు 3 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి కానుకలుగా సమర్పించారని తెలిపారు. అలాగే గో సంరక్షణ హుండీ ద్వారా రూ.7,451, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.1,59,085 ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో పూర్తి నిఘా, పటిష్టమైన భద్రత నడుమ ఈ హుండీ లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, సీఎఫ్‌ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, నాగేశ్వరరావు, దేవస్థానం సిబ్బంది, యూనియన్‌ బ్యాంక్‌ ప్రతినిధులు, ఆలయ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

వరసిద్ధుడి సేవలో

పాట్నా హైకోర్టు జడ్జి

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనుపమ చక్రవర్తి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఏఈవో రవీంద్రబాబు ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ కోదండపాణి, చిత్తూరు కోర్టు సిబ్బంది మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ ధర్మపురి మాజీ సర్పంచ్‌

బైరెడ్డిపల్లె : మండలంలోని ధర్మపురి టీడీపీ మాజీ సర్పంచ్‌ భాస్కర్‌ గురువారం తన అనుచురులతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భాస్కర్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకూ అన్యాయాలు ఎక్కువైపోతున్నాయని తెలిపారు. కార్యకర్తల దౌర్జన్యాలు మితిమీరిపోతుండడంతో పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరినట్లు పేర్కొన్నారు.

ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ

యాదమరి: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్ని కల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన గురువారం జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీతో కలిసి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ వెంకటేష్‌, తహసీల్దార్‌ పార్థసారథి, ఆర్వో లక్ష్మినారాయణ, ఎంపీడీవో వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement