● చిత్తూరు రూరల్ మండలం దిగువమాసాపల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి గణేష్ నామినేషన్ పత్రాలను టీడీపీ రౌడీలు చింపివేశారు.
● పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం నామినేషన్ కేంద్రం వద్ద పట్రపల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని అడ్డుకుని భౌతికదాడికి యత్నించారు. తవణంపల్లిలోని కేంద్రం వద్ద నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడంతో చేసేదేమీలేక అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వెనుదిరిగారు.
● జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే థామస్ తమిళనాడు నుంచి రౌడీలను రప్పించి అల్లర్లు సృష్టించారు. ఏకంగా 300 మంది రౌడీలను రప్పించి భయాందోళనలు సృష్టించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు 20 మంది నామినేషన్లు దాఖలు చేయకుండా కేంద్రం వద్దే కాపుకాచి అడ్డుకున్నారు. దీంతో 20 మంది ఎంపీటీసీ అభ్యర్థులు జీడీనెల్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. చివరకు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ స్వయంగా కేంద్రం వద్దకు విచ్చేసి నామినేషన్లు దాఖలు చేయించాల్సి వచ్చింది.
● పెనుమూరు, ఎస్‌ఆర్‌పురంలోనూ అదే తంతు కొనసాగింది. పెనుమూరులో 9 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రంలోపలికి పంపకుండా అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థులు ధర్నా చేపట్టారు. చివరకు ఎన్నికల అధికారుల చొరవతో మధ్యాహ్నం 2 గంటలకు అభ్యర్థులను లోనికి తీసుకెళ్లారు. లోనికి వెళ్లిన 9 మంది అభ్యర్థుల ఫోన్లు గంటల తరబడి స్విచ్ ఆఫ్ రావడంతో వారు ఏమయ్యారో అని కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు.


