నగరి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు ఆర్‌వో బాలాజీ నాయక్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు మాజీ మంత్రి రోజా ఫిర్యాదు
చిత్తూరు కలెక్టరేట్ : నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని, ఫారం–7 జారీ చేసిన తర్వాత మరో అభ్యర్థిని ఏకగ్రీవమైనట్టు ఎలా ప్రకటిస్తారని మాజీ మంత్రి ఆర్.కే.రోజా మండిపడ్డారు. ఆమె బుధవారం ఆధారాలతో సహా జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల పరిశీలన అనంతరం అధికారులు నగరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బాలకృష్ణకు ఫారం 7 జారీ చేశా రని తెలిపారు. నామినేషన్‌ను ఆమోదించినట్లు ధ్రువీకరించారన్నారు. ఫారం 7 ఇచ్చిన తర్వాత అభ్యర్థి పోటీలో ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా శ్రీనివాసన్ అనే వ్యక్తి ఏకగ్రీవమైనట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. నగరి ఆర్‌వో, మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ఒత్తిళ్లతో కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బదిలీ అయినా రిలీవ్ కాకుండా ఆర్‌వోగా విధులు నిర్వహించడం పట్ల సందేహాలు వ్యక్తంచేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో టీడీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లలో సాంకేతిక లోపాలను సరిదిద్దుకునే అవకా శం ఇచ్చిన అధికారులు, నగరిలో తమ అభ్యర్థుల పట్ల భిన్నంగా వ్యవహరించడం దారుణమన్నారు. నగరి కమిషనర్ బాలాజీ నాయక్‌ను తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నగరిలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని లేదా బాలకృష్ణను పోటీలో అనుమతించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, బాధిత అభ్యర్థులు బాలకృష్ణ, రమేష్‌రెడ్డి, నీలమేఘం, రాహుల్‌రెడ్డి పాల్గొన్నారు.


