తిరుమల శ్రీవారి ధ్వజ స్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్న అధికారులు
యోగుల పర్వతంపై కార్తీక మహాదీపం
బంగారు పాళెంలో బురుజు చుట్టూ
భక్తుల ప్రదర్శన
శ్రీకాళహస్తిలో
చుక్కాని ఉత్సవం
కార్తీక పౌర్ణమి వెలుగులు భక్తజన హృదయాలను పరవశింపజేశాయి. దేదీప్యంగా ప్రకాశిస్తున్న దీపాలు
చీకట్లను పారదోలాయి. దివ్యతేజోవిరాతంగా విరాజిల్లుతూ జనుల మనసులను పులకింపజేశాయి.
పవిత్ర మాస మహిమాన్వితశక్తిని కళ్లెదుట ఆవిష్కరింపజేశాయి. దేవతామూర్తుల ప్రబలశక్తులను
ఇనుమడింపజేశాయి. సకల ప్రాణకోటి సర్వపాపాలను హరింపజేశాయి. సృష్టి.. స్థితి.. లయకారుని స్మరణలతో ఆలయాలు ఇల కై లాసంగా.. భువి వైకుంఠంగా విలసిల్లాయి. – కాణిపాకం, వడమాలపేట(పుత్తూరు)


