వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.24,277.82 కోట్లు పంపిణీ 40.80 లక్షల మందికి లబ్ధి 5 లక్షల మందికి పైగా రాయితీ విద్యుత్‌తో ఊరట ఇంటి వద్దకే సేవలు, మౌలికవసతులకు పెద్దపీట వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బాబు ప్రభుత్వం
చిత్తూరు కార్పొరేషన్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమంపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో చిత్తూరు జిల్లా రూపురేఖలు మారిపోయాయి. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ), నాన్‌న్ –డీబీటీ పథకాలు (పరోక్ష నగదు బదిలీ), విద్యుత్ రాయితీలు, రహదారులు, పక్కా ప్రభుత్వ భవనాల నిర్మాణం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి రూ.24,277.82 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు పింఛన్ అందడం, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థిక భరోసా లభించడాన్ని జిల్లా ప్రజలు నేటికీ గుర్తుచేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు, బెంచీల ఏర్పాటు నాటి పాలనకు నిదర్శనంగా నిలిచాయి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, గతంలో పల్లె ముంగిటకు తెచ్చిన సచివాలయం, ఆర్‌బీకే వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.కోట్లలో నిధులు
గత ఐదేళ్లలో మారుమూల గ్రామాలకు సైతం భారీగా నిధులు కేటాయించారు. ఇందుకు ఉదాహరణగా బంగారుపాళ్యం మండలంలోని 1,290 జనాభా ఉన్న మహాసముద్రం గ్రామానికే దాదాపు రూ.18 కోట్ల వరకు లబ్ధిచేకూర్చారు. ఈ నిధులతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), వైఎస్సార్ హెల్త్ క్లినిక్, పక్కాగృహాలు, రహదారుల నిర్మాణంతో పాటు పింఛన్లు, రైతు భరోసా, విద్యాదీవెన, చేయూత, జగనన్న తోడు, సున్నావడ్డీ, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను అందించారు. విద్యుత్ రాయితీ, మౌలిక సదుపాయాలు
విద్యుత్ సబ్సిడీ రూ.6,389.81 కోట్లు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, రజక, నాయీబ్రాహ్మణ, ఆక్వా, స్వర్ణకారులకు అందించిన విద్యుత్ రాయితీల ద్వారా ఐదేళ్లలో 5 లక్షల మందికి పైగా రూ.6,389.81 కోట్ల ప్రయోజనం పొందారు. అలాగే రహదారుల నిర్మాణానికి రూ.1,762 కోట్లు వెచ్చించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఈఏపీ, పీఎంజీఎస్‌వై పథకాల కింద 1,661 కిలోమీటర్ల గ్రామీణ అనుసంధాన రహదారుల నిర్మాణానికి రూ.1,172 కోట్లు ఖర్చు చేశారు. అలాగే ఆర్‌అండ్‌బీ పరిధిలో 449 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.590 కోట్లు వ్యయం చేశారు. పక్కా భవనాలకు రూ.240.84 కోట్లు వరకు ఖర్చుచేశారు. జిల్లాలో వ్యాప్తంగా 834 పక్కా ప్రభుత్వ భవనాలను నిర్మించారు. ఇందులో 335 గ్రామ సచివాలయాలకు రూ.134 కోట్లు, 340 రైతు భరోసా కేంద్రాలకు రూ.74.12 కోట్లు, 159 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లకు రూ.32.72 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా కోసం రూ.93.50 కోట్లు వెచ్చించారు.
నాన్ డీబీటీ ప్రయోజనాలు
పథకం లబ్ధిదారులు అందిన
పేరు సాయం
రూ.కోట్లలో
జగనన్న తోడు
(రుణాలు) 10,06,204 5,794.62
రైస్‌కార్‌ుడ్స 5,20,318 1,136.58
ఇంటిపట్టాలు 25,454 636.35
గోరుముద్ద 1,45,395 144.04
విద్యాకానుక 1,45,126 103.07
సంపూర్ణపోషణ 39,074 82.84
ట్యాబ్‌లు 18,760 24.80
మొత్తం 19,00,331 7,922.31


