నేడు చిత్తూరులో వృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

నేడు చిత్తూరులో వృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరం

Nov 25 2026 12:55 AM | Updated on Nov 25 2026 12:55 AM

● రేపే పంచాయతీ ఎన్నికలు ● ఏర్పాట్లు పూర్తి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 25న నగరంలోని తపోవనంలో వృద్ధులకు ప్రత్యేక వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నట్లు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ పుల్లారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తపోవనంలోని రాస్‌ వృద్ధాశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్‌ఏపీఎస్‌ఆర్‌సీ, అవ్యయ్‌ పథకాలలో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు), కంటి వైద్య నిపుణులు, జనరల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందిస్తారని వివరించారు. జిల్లాలోని వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారితో పాటు ఇతర వృద్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఏపీపీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి జారీచేసిన ఏపీపీఎస్సీ దరఖాస్తులకు గడువు పొడగించారని మంగళవారం కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు 27/26, 31/26, 32/26, 34/26, 35/26, 36/26కు సంబంధించి ఆన్‌న్‌లైన్‌ దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 7వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌ సర్వీసులు, గనులు, భూగర్భశాస్త్ర శాఖ, మైనింగ్‌ సబ్‌ఆర్డినేట్‌ సర్వీసు, అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌, రవాణా శాఖలోని మోటారు వాహనాల తనిఖీ పోస్టులు ఈ నోటిఫికేషన్ల పరిధిలో ఉన్నాయన్నారు. జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఆన్‌లైనన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఎన్నికలకు వేళాయె

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని 9 మండలాల పరిధిలో గురువారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సుధాకర్‌రావు తెలిపారు. ఆయన మంగళవారం పలు అంశాల పై మాట్లాడారు. ఈ నెల 26న ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. అనంతరం భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అదే రోజు రాత్రిలోపు ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. మొత్తం 182 సర్పంచ్‌, 1,908 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 4,17,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి (18), కుప్పం (29), రామకుప్పం (22), శాంతిపురం (23), పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి (21), గంగవరం (16), పలమనేరు రూరల్‌ (10), పెద్దపంజాణి (25), వెంకటగిరికోట (18) పంచాయతీల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు.

మళ్లీ మొదలైన

ఓపెన్‌ చదువులు

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ చదువులు ప్రారంభమయ్యాయి. తాజాగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ (ఓపెన్‌ యూనివర్సిటీ) విద్యా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యను అందరికీ చేరువ చేసేందుకు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని ప్రారంభించారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ మొదటి సెమిస్టర్‌ తరగతులకు అడ్మిషన్‌ల దరఖాస్తులు స్వీకరించారు. ఈ మూడు కేంద్రాల్లో త్వరలో మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభించనున్నారు. గత పదేళ్లుగా అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు నిలిచిపోవడంతో చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పుంగనూరు తదితర ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువత, చిరుద్యోగులు ఓపెన్‌ యూనివర్సిటీ ఉన్నత చదువులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల యూనివర్సిటీలను ఆశ్రయించేవారు. ఓపెన్‌ యూనివర్సిటీ ఉన్నత విద్యకు ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement