అన్నీ ఉన్నా ఎందుకిలా? | - | Sakshi
Sakshi News home page

అన్నీ ఉన్నా ఎందుకిలా?

Nov 25 2026 12:55 AM | Updated on Nov 25 2026 12:55 AM

ప్రతిపక్షం పోటీలో ఉండకూడదని అడుగడుగునా కుట్రలు వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు ‘పచ్చ’ పట్టు టీడీపీ నేతల కనుసన్నల్లో నడిచిన రిటర్నింగ్‌ అధికారులు మలి దశలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్ల తిరస్కరణ నేడు అప్పీళ్లు.. చిన్నపొరపాట్లు ఉన్నా ఆమోదించాలన్న కలెక్టర్‌

సాక్షి, చిత్తూరు: జిల్లాలో జరుగుతున్న మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల తలలు పగులగొట్టించుకుని, రక్తం చిందించి, అటు అధికారపార్టీ నేతల దాడులు– న్యాయం చేయాల్సిన పోలీసుల ప్రేక్షకపాత్ర మధ్య తొలి దశలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎట్టకేలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. రెండో దశలో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులను చంపేస్తానంటూ ఫోన్లలో బెదిరింపులకు గురిచేయడం, నామినేషన్‌ పత్రాలు చించేయడం, దాడులకు పాల్పడడం చేసి పదుల సంఖ్యలో పంచాయతీలను పచ్చ నేతలు ఏకగ్రీవం చేసుకున్నారు. అధికారులు చేసేదేమీలేక తుది పులిచెర్ల, రొంపిచెర్ల, నగరి, నిండ్ర మండలాలతో పాతు పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మంగళవారం ప్రకటించారు. ఇదే సమయంలో మూడో దశ నామినేషన్ల పరిశీలనలో చిత్తూరు మండలంలో చోటుచేసుకున్న పరిణామాలు.. పులిచెర్ల–రొంపిచెర్లలో కూడా జరగలేదు. ఏకంగా రిటర్నింగ్‌ అధికారులు పచ్చ నేతలకు దాసోహమంటూ సాగిలపడ్డారు. పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అకారణంగా తిరస్కరించారు.

అప్పీళ్లల్లో ఆమోదించడం

ఇక్కడ జరిగిన అన్యాయంపై పలువురు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేశారు. ఆర్‌వోలు ఏకపక్షంగా వ్యహవరించి, కావాలనే తమ నామినేషన్లను తిరస్కరించారన్నారు. దీనిపై కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్సు తీసుకున్నారు. చిన్నపాటి పొరపాట్లు ఉన్నా అప్పీళ్లల్లో నామినేషన్లను ఆమోదించాలని అధికారులను ఆదేశించారు.

మూడో దశ ఎన్నికలకు సంబంధించి జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆర్‌వోల తీరు సర్వాత్రా మిర్శలకు దారితీస్తోంది. ప్రధానంగా చిత్తూరు మండలంలో మంగళవారం ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. చిత్తూరు టీడీపీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి, నగరంలోని టీడీపీ కార్పొరేటర్‌, పలువురు టీడీపీ నేతలు చిత్తూరు రూరల్‌ మండలంలోని నామినేషన్ల కేంద్రాలను చుట్టుముట్టారు. పలువరు ఆర్‌వోలతో ఉదయం 6 గంటల నుంచే మంతనాలు మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడమే లక్ష్యంగా.. నామినేషన్‌ కేంద్రాల తలుపులు మూసేసిమరీ కుట్రలకు పాల్పడ్డారు. ఫలితంగా చీకటిపడ్డాక.. చిత్తూరులోని నాయినిచెరువు, పెద్దిశెట్టిపల్లె, తొప్పాతిపల్లె, తుమ్మిందపాళ్యం, తాళంబేడు, అనంతాపురం, కుర్చివేడు, పాలూరు, గుడిపాల మండలంలోని మొగరాలపల్లె పంచాయతీల్లోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు తిరస్కరిస్తున్నట్లు ఆర్‌వోలు ప్రకటించారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా నామినేషన్లు తిరస్కరిచారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement