– 8లో
చిత్తూరు నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై వివిధ గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు.
అధికార పక్షం కుట్ర
చిత్తూరు రూరల్(కాణిపాకం): పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులు, నేతలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు మండలం తుమ్మింద పంచాయతీ కేంద్రంలో మంగళవారం జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమైంది. తుమ్మింద నామినేషన్ కేంద్రం పరిధిలోని తుమ్మింద, నాయనిచెరువు, పెద్దశెట్టిపల్లి, తొప్పాతిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ఏడుగురు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సర్పంచ్ పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేవారు. అయితే పరిశీలన సందర్భంగా అధికారులు వివిధ సాకులు చూపుతూ ఇందులో ఏడు నామినేషన్లు తిరస్కరించారు. అధికారుల తీరుపై బాధిత అభ్యర్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా, అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతోనే తమ నామినేషన్లు రద్దు చేశారని ఆండాలమ్మ, రంజని, కుమార్, తేజ, లోకమందడి ఆరొపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కిస్తామని వారు హెచ్చరించారు.


