చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగరంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారిలో టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు నరేష్చౌదరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి, యూనిట్ ఇన్చార్జి వినోద్, 50వ డివిజన్ అధ్యక్షుడు మంజేష్కుమార్(కుట్టి), ఆ డివిజన్ ఎస్సీ సెల్ నాయకుడు సుందర్ ఉన్నారు. అలాగే జనసేన మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, పెద్దకొత్తూరు నాయకుడు రవిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ఇక్బాల్, నగర యూత్ అధ్యక్షుడు నవాజ్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు అప్పోజి, ఆను, మనోజ్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు
శ్రీరంగరాజపురం : మండలంలోని ఏఎంపురం పంచాయతీ పోతగిళ్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏలుమలై, అన్భు, మహేంద్ర ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గురవారెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అవినీతి, దౌర్జన్యం, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యుర్థుల విజయా నికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మణి, మాజీ ఎంపీపీ జనార్ధన్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, నియోజవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మణి, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి రజిని, సంఘ సంస్కర్త పైనేని మురళి, మాజీ సర్పంచులు అమృతరాజ్, మహేష్,బాబు, నాయకులు హరిరెడ్డి, భూపతిరెడ్డి, ఆనంద్, జయ, రఘు, తేజ, ఏకాంబరం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, నాయకులు
టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు నరేష్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విజయానందరెడ్డి


