గుడిపాల: గుడిపాల మండలం మద్రాస్ క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కారు రోడ్డు పక్కన ఉన్న గ్రిల్స్‌ను ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డా రు. ఎస్‌ఐ రామ్మోహన్ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురికి చెందిన యువరాజ్(22), జయంతి(19) దంపతులు తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుని శనివారం తిరుగు పయనమయ్యారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుడిపాల మండలం మద్రాస్ క్రాస్ రోడ్డు వద్ద యువరాజ్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గ్రిల్స్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 సిబ్బంది చీలాపల్లె సీఎంసీకి తరలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ హత్య
కుప్పం: గుడుపల్లె మండ లం వడ్డిగొళ్లపల్లి వద్ద మహిళను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన విష యం ఆలస్యంగా ఆదివా రం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి సమీపంలోని మనార్లపల్లికి చెందిన జ్యోతికతో వడ్డిగొళ్లపల్లికి చెందిన శేఖర్ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెను ఏడాది క్రితం స్వగ్రామానికి తీసుకువచ్చి సహజీనం చేస్తున్నాడు. వారం రోజులుగా జ్యోతిక, శేఖర్ కనబడకుండా పోయారు. గ్రామస్తులు వారి గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో దుర్వానప రావడంలో గ్రామస్తులు అనుమానంతో చూడగా మహిళ శవం కనిపించింది. సమాచారం అందుకున్న గుడుపల్లె పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. విచారణలో ఆమె జ్యోతికగా తేలింది. శేఖర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
ఇద్దరి మృతి
గంగాధరనెల్లూరు: గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తానా వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు రూరల్ మండలం దిగువమాసపల్లి పంచాయతీ దిగువకండ్రిగ గ్రామానికి చెందిన గోవిందస్వామి కుమారుడు గోపి(35), ఎగువకండ్రిగ గ్రామానికి చెందిన టి.చిన్నబ్బకుమారుడు జగన్నాథం బైక్‌లో వెళుతున్నారు. తానా వద్ద రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పుత్తూరు వైపు వెళుతున్న సత్యవేడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతిచెందా రు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గోపికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అతను చికెన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈతకు వెళ్లి యువకుడి మృతి
కుప్పం: మండలంలోని గుడ్లనాయనపల్లిలో ఆదివారం ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గుడ్లనాయనపల్లికి తమ్మడు కుమారుడు రాజేష్(27) స్నేహితులతో కలిసి ఆదివారం గ్రామ సమీపంలోని మర్రిమా ను రేవులో ఈతకు వెళ్లాడు. రాజేష్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితు లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలి తం లేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ఫారంలు అందజేత
చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీ తరపున అందజేసిన ఏ ఫారంలను జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీకి ఆదివారం అందజేశారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ప్రతినిధులు ఏ ఫారంలను అధికారికంగా అందజేశారు. నిబంధనల ప్రకా రం ఏ ఫారంల పరిశీలన అనంతరం నామినేషన్‌ల ఘట్టంలో అభ్యర్థులు దాఖలు చేసే బీ ఫారంల ప్రామాణికతను అధికారులు నిర్ధారిస్తారు.
ప్రమాదంలో గాయపడిన యువరాజ్
ప్రమాదంలో
గాయపడిన జయంతి


