నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

జావెలిన్‌త్రోలో

బంగారు పతకం

పెద్దపంజాణి: ఆటల మైదానంలో ప్రతిభకు పదును పెట్టి జావెలిన్‌ను లక్ష్యం దిశగా విసిరి బంగారు పతకా న్ని సొంతం చేసుకు న్నాడు రాజుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యా ర్థి చరణ్‌. చిత్తూరులో ని డీఎస్‌ఏ స్టేడియంలో శనివారం చిత్తూరు జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌–14, అండర్‌–16 విభాగాల్లో నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఇందులో రాజుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌ జావెలిన్‌త్రోలో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు జనార్ధన్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు దొరై అభినందించారు. చరణ్‌ విజయంతో తోటి విద్యార్థుల్లోనూ క్రీడల పట్ల ఆసక్తి, ఉత్సాహం పెరిగాయి.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయాలని వివరించారు.

ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో

అడ్మిషన్ల గడువు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం పొందడానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు డీఈవో లక్ష్మీనారాయణ, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ జయప్రకాష్‌ నాయుడు తెలిపారు. వారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల మధ్యలోనే చదువు మానేసిన వారికి ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సువర్ణావకాశమని తెలిపారు. ఇక్కడ టెన్త్‌, ఇంటర్‌ పూర్తి చేసిన వారు భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. ఇందులో అడ్మిషన్లకు ఎలాంటి అపరాధ రుసుము (లేట్‌ ఫీజు) లేకుండా ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడగించినట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని ఏపీ ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్ల నిర్వాహకులు, ఉపాధ్యాయులు అడ్మిషన్ల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన అభ్యర్థుల ను గుర్తించి ఈ నెల 31వ తేదీలోగా అడ్మిషన్లు పొందేలా చొరవ చూపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement