అక్రమాలపై విచారణకు సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై విచారణకు సిద్ధమా?

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

● ఒక్క విమర్శా లేకుండా సచివాలయ ఉద్యోగాల భర్తీ ● మెగా డీఎస్సీలో అన్నీ అక్రమాలే ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

పాలసముద్రం : ‘‘మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 1.50 లక్షల గ్రామ సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రాలేదు. మెగా డీఎస్సీలో అన్నీ అక్రమాలే. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ మౌనంగా ఉంటున్నారు. డీఎస్సీలో భర్తీ చేసిన ఉద్యోగాలు, సచివాలయాల ఉద్యోగాలపై సీబీఐ విచారణకు సిద్ధమా’’ అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్‌ విసిరారు. ఆయన బుధవారం పాలసముద్రంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ అత్యంత పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఆనాడు ఒక్క విమర్శ కూడా రాలేదని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను 2019 జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు అంత్యంత పకడ్బందీగా చేపట్టామని పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సంద్భంగా కులం, మతం, పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు ఇచ్చి అధికారకంగా పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. అలాంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు శాంతియుతంగా చేపట్టిన ధర్నాపై పోలీసులతో లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లడం బాధాకరమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధంగా గళం విప్పిన ఉద్యోగులను అణచివేయడం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగులపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీలో 3,437 మందికి క్రీడా కోటా కింద ఉద్యోగాలు ఇస్తే అందులో 801 మందికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనప్పటికీ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. మోగా డీఎస్సీలో అక్రమాలు జరగకపోతే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరినట్లు సీబీఐ విచారణకు ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement