తిరుమలలో భక్తుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల ఆందోళన

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పలువురు భక్తులు బుధవారం ఆందోళనకు దిగారు. తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. అయితే ఈ విషయం తెలియక 1వ తేదీ గురువారం దర్శన.ం కోసం పలువురు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సిఫార్సు లేఖలు సమర్పించేందుకు ప్రయత్నించగా అధికారులు నిరాకరించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు అడిషనల్‌ ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సిఫార్సు లేఖలు స్వీకరించాలని నినాదాలు చేశారు. అధికారులు భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement