అద్దె ఇళ్లలోని అర్హులకు సైతం శఠగోపం ఆధార్ మిస్ మ్యాచ్‌తో దివ్యాంగులకు నష్టం
డప్పు కళాకారులకు ఐడీల మంజూరులో జాప్యం
చివరి రోజు సచివాలయాల వద్ద తప్పని పడిగాపులు
సకాలంలో ఓటీపీలు రాక తీవ్రంగా ఇబ్బందులు నిరుపేదల గొంతుకోసిన సర్కారు ఆంక్షలు
శ్రీవిల్లి పుత్తూరు నుంచి తిరుమలకు చేరిన పుష్ప మాలలతో జియ్యంగార్లు, అధికారులు
అద్దె ఇంట్లో ఉంటున్న అభాగ్యుల కొత్త పింఛన్ల ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. అద్దె ఇంట్లో ఉండి పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆయా అప్లికేషన్లను వెరిఫికేషన్‌లో తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. దరఖాస్తుదారు పేరు మీదే కరెంటు బిల్లు ఉండాలనే నిబంధన విధించింది. అలాగే వెయ్యి అడుగుల స్థలానికి మించి ఇల్లు నిర్మించి ఉంటే అనర్హత వేటు వేసేందుకు తెగబడుతోంది. ఈ క్రమంలో నామమాత్రంగా దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంత మంది అర్హులు పింఛన్ అందుకుంటారో 26వ తేదీ పైన తేలనుంది. సర్కారు నిబంధలపై పలువురు మండిపడుతున్నారు. కొత్త పింఛన్లు ఇస్తామని ఆశపెట్టి.. సవాలక్ష ఆంక్షలు విధించి నిరుపేదల గొంతు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : పేరుకేమో కొత్త పింఛన్‌ల దర ఖాస్తుకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు డప్పు కొట్టుకుంటోంది. క్షేత్రస్థాయిలో కొత్త పింఛన్‌ల నమోదులో తీవ్రమైన ఆంక్షలు పెడుతోంది. ఈ కఠిన నిబంధనలతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది కొత్త పింఛన్‌లకు నమోదు చేసుకోలేక నష్టపోతున్నారు. ఒక వైపు దరఖాస్తు కు ఈ నెల 18వ తేదీ ఆఖరి తేదీ అని వెల్లడించడంతో వేలాది మంది సచివాలయాల వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరీక్షించారు. దరఖాస్తు సమయంలో ఓటీపీలు రాకపోవడం, నమోదులో సవాలక్ష నిబంధనలు పాటించాల్సి రావడంతో పెద్దసంఖ్యలో అర్హులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. అలాగే ఒక వైపు సాంకేతిక లోపాలు, మరోవైపు కఠిన ఆంక్షలు అర్హుల గొంతు కోస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నారు.
అద్దె ఇళ్లలో ఉండేవారికి బిగ్ షాక్
కొత్త పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారుల నుంచి కరెంట్ బిల్లులను తప్పనిసరని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లాలో అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి బిగ్ షాక్ తగిలింది. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి ఇది తలపోటుగా మారింది. ఓనర్ పేరిట ఉన్న కరెంట్ బిల్లులను సమర్పించడం, అద్దె ఇళ్లలోని మీటర్ల వినియోగం పరిమితికి మించితే దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పింఛన్ అర్హత సాధించాలంటే గృహ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలని, ఆస్తి పరిమితిలో పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, స్థలం విస్తీర్ణం 1000 చదరపు అడుగులలోపే ఉండాలనే నిబంధన విధించారు. దీంతో దరఖాస్తుదారులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.
దివ్యాంగులు, డప్పు కళాకారుల ఇక్కట్లు
పింఛన్‌ల దరఖాస్తులో దివ్యాంగులకు ఆధార్‌మిస్ మ్యాచ్ సమస్య పెద్ద సమస్యగా మారింది. సదరం సర్టిఫికెట్‌లో ఉన్న వివరాలకు, ఆధార్‌కార్డులోని పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలకు తేడా లు ఉన్నాయంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నా రు. ఈ సమస్యతో దివ్యాంగులు కొత్త పింఛన్‌లు పొందలేని దుస్థితి తలెత్తింది. మరోవైపు ఐఅండ్‌పీఆర్ శాఖ అధికారుల అలసత్వంతో డప్పు కళాకారులు సకాలంలో ఐడీ కార్డులు పొందలేకపోయా రు. దీంతో వందలాది మంది డప్పుకళాకారులు దరఖాస్తుకు అవకాశం కోల్పోయారు.
వడపోత ప్రక్రియ ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 42,458 మంది కొత్త పింఛన్‌లకు దరఖాస్తు లు చేసుకున్నారు. ప్రభుత్వం తొలి విడతలో తక్కు వ మందికి మాత్రమే పింఛన్‌లు మంజూరు చేయనుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో వెరిఫికేషన్ పేరుతో దరఖాస్తులను తిరస్క రించి, సంఖ్యను తగ్గించే కుట్ర చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కరెంట్ బిల్లు ఉంటేనే దరఖాస్తుకు అవకాశం


