● వైభవంగా వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవా రం ఉత్సవాల్లో భా గంగా స్వామివారు ఉదయం బంగారు చిన్న శేష వాహనంపై ఊరేగారు. అనంత రం గణనాథునికి 400 లీటర్ల పాలు, వివిధ రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సుగంధ పుష్పాలతో అర్చించారు. సాయంత్రం యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి ఉభయకర్తల ఆధ్వరంయలో బంగారు పెద్ద శేష వాహనంపై వినాయకస్వామిని కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


